Police: ప్రియాంక రెడ్డి కేసు: భారీ భద్రత నడుమ నిందితులను ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ తహసీల్దార్ ముందు హాజరుపర్చనున్న పోలీసులు

  • అందుబాటులో లేని జడ్జీలు?
  • తహసీల్దార్ ఎదుట హాజరుపరిచే అవకాశం
  • షాద్ నగర్ పీఎస్ లోకి చొచ్చుకెళ్లేందుకు ఆందోళనకారుల యత్నం

ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులను పోలీసులు.. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ తహసీల్దార్ ఎదుట హాజరుపర్చనున్నట్లు తెలిసింది. జడ్జీలు అందుబాటులో లేకపోవడంతో తహసీల్దార్ ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. పోలీస్ స్టేషన్ లో నిందితులకు వైద్య పరీక్షలు ముగిశాయి. ప్రియాంక రెడ్డి హత్యాచారం ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ విద్యార్థులు, ప్రజా సంఘాల నేతలు మరోసారి షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు చెదరగొట్టారు.

నిందితులను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకెళ్లడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. దీనిపై ఉత్కంఠ నెలకొంది. భారీ ర్యాలీలు, ఆందోళనలతో  షాద్ నగర్ ప్రాంతం అంతా జనసముద్రాన్ని తలపిస్తోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News