Tammareddy: పదిమంది వచ్చి మీదపడ్డా 'జార్జి రెడ్డి' బెదిరేవాడు కాదు: తమ్మారెడ్డి భరద్వాజ

  • 'జార్జి రెడ్డి' తమ్ముడు సిరిల్ 
  • 'జార్జి రెడ్డి'పై సిరిల్ భార్య ఒక బుక్ రాసింది 
  • సిరిల్ మంచి ఫైటర్ అని చెప్పిన తమ్మారెడ్డి

తాజా ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ 'జార్జి రెడ్డి'ని గురించి తనకి తెలిసిన విషయాలను పంచుకున్నారు. 'జార్జి రెడ్డి' తమ్ముడు సిరిల్ రెడ్డి వివాహం గీతారామస్వామితో జరిగింది. 'జార్జి రెడ్డి'ని గురించిన పుస్తకాన్ని ఆమే రాశారు. కేరళలో 'జార్జి రెడ్డి' బాల్యానికి సంబంధించిన విషయాలను కూడా ఆమె ఆ పుస్తకంలో ప్రస్తావించారు.

'జార్జి రెడ్డి' తమ్ముడు సిరిల్ ఉస్మానియా యూనివర్సిటీలో నా క్లాస్ మేట్. జార్జి రెడ్డి .. సిరిల్ .. రాజయ్య .. మహిపాల్ కలిసి తిరిగేవాళ్లు. మా కాలేజ్ కి వచ్చినప్పుడు నేను కూడా వాళ్లతో ఉండేవాడిని. జార్జి రెడ్డి ఎప్పుడూ బ్లేడ్లు ..కత్తులు పట్టుకుని తిరగలేదు. సమస్య వస్తే ఒక్కడే వెళ్లిపోయేవాడు. పది .. పదిహేను మంది ఒక్కసారిగా మీదపడినా ఎదుర్కొనే శక్తిమంతుడు తను. సిరిల్ కి బాక్సింగ్ లో ప్రవేశం వుంది .. అతను కూడా మంచి ఫైటర్. అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఉండగా ఎవరూ ఏమీ చేయలేరు అన్నట్టుగా ఉండేవారు" అని చెప్పుకొచ్చారు.

More Telugu News