Disha: ప్రియాంకరెడ్డి హత్య కేసు విషయంలో బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం

  • నిందితుల తరపున లాయర్లు ఎవరూ వాదించవద్దు
  • మహబూబ్ నగర్ జిల్లా బార్ కౌన్సిల్ నిర్ణయం
  • నిందితులకు ఉరిశిక్ష పడేవరకు పోరాటం చేస్తామన్న లాయర్లు

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఆమెపై దారుణంగా అత్యాచారం జరిపి, కిరాతకంగా హత్య చేసిన నలుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. కాసేపట్లో వీరిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

 మరోవైపు, ఈ కేసుకు సంబంధించి మహబూబ్ నగర్ జిల్లా బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. నిందితుల తరపున న్యాయవాదులెవరూ కోర్టులో వాదించకూడదని తీర్మానం చేసింది. నిందితులకు మరణశిక్ష పడేవరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా లాయర్లు తెలిపారు. మరోవైపు, ప్రియాంక హత్యపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకెళ్లేందుకు విద్యార్థులు, ప్రజాసంఘాలు నేతలు యత్నించారు.

More Telugu News