car: ఏకంగా రూ.10 లక్షల ట్రాఫిక్ జరిమానా.. చెల్లించాకే కారు ఇస్తామంటోన్న పోలీసులు

  • రూ.1.82 కోట్లతో విలాసవంతమైన స్పోర్ట్స్‌ కారు కొన్న వ్యక్తి
  • సరైన పత్రాలు, నంబర్‌ ప్లేట్‌ లేకుండా డ్రైవింగ్
  • ట్రాఫిక్ పోలీసులు చలానాలు పంపుతున్నా పట్టించుకోని వైనం

రూ.1.82 కోట్లతో విలాసవంతమైన స్పోర్ట్స్‌ కారు కొనుక్కున్నాడు. సరైన పత్రాలు, నంబర్‌ ప్లేట్‌ లేకుండా తిరుగుతున్నాడు. ట్రాఫిక్ పోలీసులు చలానాలు పంపుతున్నా పట్టించుకోలేదు. చివరకు రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులకు దొరికిపోయాడు. ఆ కారుపై ఉన్న చలానాలు అన్నింటినీ గుర్తించిన పోలీసులు మొత్తం కలిపి దాదాపు రూ.10 లక్షల జరిమానా విధించి, అవి కట్టాకే కారు తీసుకెళ్లమని చెప్పారు.

గుజరాత్‌లోని అహ్మబాద్‌లోని హెల్మెల్‌ క్రాస్‌రోడ్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన గురించి అహ్మదాబాద్‌ పోలీసులు ట్విట్టర్ లో వివరాలు తెలిపారు. కారు నడుపుతున్న వ్యక్తికి ఆర్టీవో నుంచి మెమో ఇచ్చామని, జరిమానాలు పూర్తిగా చెల్లించాకే కారును ఇస్తామని పోలీసులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటారు వాహన సవరణ చట్టంతో ట్రాఫిక్ ఉల్లంఘనల జరిమానాలు అధికమైపోయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కొందరు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు.

More Telugu News