Tammareddy: 'జార్జి రెడ్డి' నిజంగానే హీరో: దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ

  • 'జార్జి రెడ్డి' సినిమాలో కల్పితాలు వున్నాయి
  • అంతా 'జార్జి రెడ్డి' గురించి మాట్లాడుకుంటున్నారు  
  • దర్శకుడు జీవన్ రెడ్డికి కృతజ్ఞతలన్న తమ్మారెడ్డి

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'జార్జి రెడ్డి' యూత్ ను ఎక్కువగా ఆకట్టుకుంది. ఈ సినిమా నుంచే 'జార్జి రెడ్డి'ని గురించి మళ్లీ మాట్లాడుకోవడం మొదలైంది. అలాంటి 'జార్జి రెడ్డి'ని గురించి అప్పట్లో ఆయనతో సన్నిహితంగా మెలిగిన తమ్మారెడ్డి భరద్వాజా తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. "జార్జి రెడ్డి పేరును .. ఆయనకి గల కొన్ని లక్షణాలను .. ఉస్మానియా విశ్వవిద్యాలయం నేపథ్యాన్ని ..  ఆయన అక్కడ చదివిన కాలాన్ని తీసుకుని కొన్ని కల్పిత సంఘటనలతో ఈ సినిమాను రూపొందించారు.

దర్శకుడు జీవన్ రెడ్డి ఈ సినిమాను ఎలా తీశాడు అనే విషయాన్ని పక్కన పెడితే, 'జార్జి రెడ్డి'ని మళ్లీ అంతా గుర్తుచేసుకునేలా చేసినందుకు నేను ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నాను. 'జార్జి రెడ్డి' గురించి అందరికీ తెలియాల్సిన అవసరం వుంది .. నిజంగానే ఆయన హీరో. విప్లవ భావాలు కలిగిన కుర్రాళ్లకు ఆయన ఆదర్శ పురుషుడు. 'జార్జి రెడ్డి' పేరు మళ్లీ అందరి నోళ్లలో నానుతున్నందుకు ఆనందంగా వుంది" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News