Musthak Ali T20- Trophy: టీ 20ల్లో రికార్డు సృష్టించిన కర్ణాటక బౌలర్ మిథున్

  • ఆరు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు
  • సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ఫైనల్లో కర్ణాటక 
  • హర్యానాపై 8 వికెట్ల తేడాతో విజయం

సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ఫైనల్లోకి కర్ణాటక చేరుకుంది. ఈ రోజు జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో కర్ణాటక 8 వికెట్ల తేడాతో హర్యానాను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా జట్టు 194 పరుగులు చేసింది. కర్ణాటక పేసర్ అభిమన్యు మిథున్ అద్భుత బౌలింగ్ తో రాణించాడు. 6 బంతుల్లో 5 వికెట్లు తీసి టీ 20ల్లో రికార్డు సృష్టించాడు. హర్యానా ఆఖరి ఓవర్లో మిథున్ ఈ రికార్డు నమోదు చేశాడు.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కర్ణాటక 15 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనెర్లు లోకేశ్ రాహుల్ 66 పరుగులు (31బంతులు, బౌండరీలు 4, సిక్సర్లు 6) చేయగా, దేవదత్ పడిక్కల్ 87 పరుగులు (42 బంతులు, బౌండరీలు 11, సిక్సర్లు 4) చేసి ఔటయ్యారు అనంతరం క్రీజులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్, మనీష్ పాండేలు మిగతా పరుగులను సాధించి జట్టుకు విజయాన్ని అందించారు. ఆదివారం జరుగనున్న ఫైనల్లో కర్ణాటకతో తమిళనాడు లేదా రాజస్థాన్ జట్టు తలపడనుంది.

More Telugu News