Toll gates: టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్ చిప్ లు అందుబాటులో వుంచాం: 'నాయ్' అధికారులు

  • ఎలక్ట్రానిక్ పద్ధతిలో టోల్ గేట్ల ఛార్జీల చెల్లింపులు
  • డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త విధానం
  • 23 బ్యాంకుల ద్వారా ఫాస్టాగ్ చిప్ లు అందిస్తున్నాం

టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్ చిప్ లు అందుబాటులో వుంచామని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (నాయ్) పీడీ విద్యాసాగర్ రావు స్పష్టం చేశారు. టోల్ గేట్ల వద్ద ఛార్జీల చెల్లింపులను ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరిపేందుకు ఉద్దేశించిన ఫాస్టాగ్ విధానం డిసెంబర్ 1 నుంచి తప్పనిసరి కానుంది.

ఈ నేపథ్యంలో నాయ్ అధికారులు మాట్లాడుతూ, 23 బ్యాంకుల ద్వారా ఫాస్టాగ్ చిప్ లు అందిస్తున్నామని, కొన్ని సమయాల్లో చిప్ లు లేకుంటే వెంటనే తెప్పించి ఇస్తున్నామని చెప్పారు. ఎల్లుండి నుంచి టోల్ గేట్ల వద్ద నగదు లావాదేవీలకు ఒక లైనే వుంటుందని అన్నారు. ఫాస్టాగ్ లో సాంకేతిక సమస్య వస్తే వెంటనే పరిష్కరిస్తున్నామని, లారీలు, కార్ల యజమానుల సంఘాలు కొన్నాళ్లు వాయిదా వేయమన్నాయని, సంఘాల వినతులను ఉన్నతాధికారులకు పంపామని చెప్పారు. ఫాస్టాగ్ పై అవగాహన కల్పించే నిమిత్తం టోల్ గేట్ల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేస్తామని అన్నారు.

More Telugu News