Sensex: జీడీపీ డేటా ఎఫెక్ట్... నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 336 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 95 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని భారీ నష్టాలతో ముగించాయి. జీడీపీ డేటా విడుదలవుతున్న నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించిన ఇన్వెస్టర్లు... లాభాల స్వీకరణకే మొగ్గు చూపారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 336 పాయింట్లు కోల్పోయి 40,793కు పడిపోయింది. నిఫ్టీ 95 పాయింట్లు నష్టపోయి 12,056కు దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (1.28%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.70%), ఎన్టీపీసీ (0.35%).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-2.50%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.37%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.12%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.03%), టాటా మోటార్స్ (-2.03%).

More Telugu News