Hyderabad: సజీవ దహనం చేయడానికి తీసుకెళ్లే క్రమంలోనూ డీసీఎంలో ప్రియాంకారెడ్డిపై అత్యాచారం

  • తొండుపల్లి జంక్షన్ వద్ద ఖాళీ ప్రదేశంలో అత్యాచారం
  • అనంతరం డీసీఎంలో తీసుకెళ్లినట్లు భావిస్తోన్న పోలీసులు
  • ప్రియాంకారెడ్డి హత్య కేసులో పురోగతి
  • నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

పశు వైద్యాధికారిణి  ప్రియాంక రెడ్డి హత్యాచారం కేసులో పలు విషయాలు బయటపడుతున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలం కొల్లూర్‌ గ్రామంలో పనిచేస్తోన్న ఆమె.. శంషాబాద్ లోని తన ఇంటికి వచ్చే సమయంలో కొందరు దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఔటర్‌ రింగ్ రోడ్డుపై కిడ్నాప్‌ చేసి, అత్యాచారం చేసి ఆమెను 28 కి.మీ. దూరానికి డీసీఎంలో తీసుకెళ్లి సజీవ దహనం చేసినట్లు తెలిసింది.
 
డీసీఎంలోనూ ప్రియాంకారెడ్డిపై అత్యాచారం జరిగినట్లు తెలిసింది. ప్రియాంకారెడ్డి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధిస్తున్నారు. ఇప్పటివరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. తమ అదుపులో శంషాబాద్ కు చెందిన ఇద్దరు నిందితులు, అనంతపురానికి చెందిన మరో ఇద్దరు నిందితులు ఉన్నట్లు తెలిపారు. ఆమెపై సామూహిక అత్యాచారం చేసినట్లు అనుమానిస్తున్నారు. తొండుపల్లి జంక్షన్ వద్ద ఖాళీ ప్రదేశంలో అత్యాచారం చేసినట్లు భావిస్తున్నారు. అనంతరం అక్కడి నుంచి డీసీఎంలో తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆమెపై మరోసారి అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం.

More Telugu News