TSRTC: అప్పుడు హీరోలం...ఇప్పుడు జీరోలమా? : కేసీఆర్ పై యూనియన్ నాయకుల మండిపాటు

  • టీఎస్ఆర్టీసీ జేఏసీ సమైక్య పోరాటం వల్లే సీఎం దిగివచ్చారు
  • ఇప్పుడు వ్యూహాత్మకంగానే అలా మాట్లాడుతున్నారు
  • నాయకులు, కార్మికుల మధ్య చిచ్చు పెట్టే ఉద్దేశం

ఆర్టీసీ యూనియన్ల ఐక్యపోరాటం వల్లే ముఖ్యమంత్రి కేసీఆర్ దిగివచ్చి తిరిగి కార్మికులను విధుల్లోకి తీసుకున్నారని, ఆయనేమీ జాలిపడి కాదని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. సిద్ది పేటలో ఓ యూనియన్ నాయకుడు మాట్లాడుతూ ‘యూనియన్లతో నేను సంప్రదించేది లేదు. వారిని ప్రగతి భవన్‌కు రానివ్వను కూడా. కార్మికుల బతుకులు బజారున పడేసిన వాళ్లను, వారి మృతికి కారకులైన నేతలను క్షమించదలచుకోలేదు. క్రమశిక్షణతో ఉంటే సింగరేణి తరహాలో ఆర్టీసీని తీర్చిదిద్దుతా. నేను చెప్పిన మాట వింటే బాగుపడతారు.యూనియన్ నాయకులను వదిలేయండి...మీరు రండి, కూర్చుని మాట్లాడుకుందాం, సంస్థ అభ్యున్నతికి కృషి చేద్దాం' అంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల వెనుక వ్యూహం ఉందని మండిపడ్డారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఇదే యూనియన్‌ నాయకులు కార్మికులను పోరాటానికి ఏకోన్ముఖులను చేసినప్పుడు, ఉద్యమ పిడికిలి బిగించినప్పుడు హీరోలమని పొగిడిన కేసీఆర్, ఇప్పుడు తమను జీరోలని అనడం దుర్మార్గమన్నారు. నాయకులు, కార్మికుల మధ్య చిచ్చు పెట్టే ఉద్దేశం ఇదని, ఇలాంటి బెదిరింపులకు భయపడమని స్పష్టం చేశారు.  

More Telugu News