Fadnavis: ఎన్నికల అఫిడవిట్ వ్యవహారంలో ఫడ్నవీస్ కు కోర్టు సమన్లు

  • రెండు క్రిమినల్ కేసులు ఉన్నట్టు అఫిడవిట్ లో పేర్కొనలేదంటూ పిటిషన్
  • ఫడ్నవీస్ పై నాగపూర్ కోర్టును ఆదేశించిన న్యాయవాది సతీశ్
  • సుప్రీం ఆదేశాలతో సమన్లు జారీ చేసిన మేజిస్ట్రేట్ కోర్టు

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు నాగపూర్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఎన్నికల అఫిడవిట్ లో తనపై ఉన్న రెండు క్రిమినల్ కేసులకు సంబంధించిన సమాచారాన్ని పేర్కొనలేదనే ఆరోపణల నేపథ్యంలో ఈ సమన్లు జారీ అయ్యాయి.

సమాచారాన్ని దాచిన ఫడ్నవీస్ పై క్రిమినల్ కేసులు తీసుకోవాలంటూ నాగపూర్ కు చెందిన న్యాయవాది సతీశ్ స్థానిక మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి నవంబర్ 1న మేజిస్ట్రేట్ కోర్టు అప్లికేషన్ ను రిస్టోర్ చేసింది. కింది కోర్టు తీర్పును ముంబై హైకోర్టు సమర్థిస్తూ, పిటిషనర్ పిటిషన్ ను తోసిపుచ్చింది.

ఈ నేపథ్యంలో, సీన్ సుప్రీంకోర్టుకు మారింది. పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు సతీశ్ పిటిషన్ ను స్వీకరించి, విచారణ జరపాలంటూ మేజిస్ట్రేట్ కోర్టును ఆదేశించింది. దీంతో, నవంబర్ 4న కేసును క్రిమినల్ కేసుగా నమోదు చేసింది. ఈ క్రమంలో ఫడ్నవీస్ కు సమన్లు జారీ అయ్యాయి.

More Telugu News