TSRTC: తెలంగాణలో కదిలిన బస్సులు... కార్మికుల్లో అమితానందం!

  • 55 రోజుల తరువాత సమ్మె విరమణ
  • 3.30 గంటలకే డిపోల వద్దకు కార్మికులు
  • పూర్తి స్థాయిలో బస్సులు తిప్పుతామన్న అధికారులు

55 రోజుల తరువాత తెలంగాణలో ఆర్టీసీ బస్సులు తిరిగి కదిలాయి. ఎటువంటి షరతులు లేకుండా తిరిగి విధుల్లో చేరాలని నిన్న రాత్రి సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్న కార్మికులు, తెల్లవారుజాము నుంచే డిపోల వద్ద బారులు తీరారు. విధుల్లో చేరిపోయి, తమ బస్సులను బయటకు తీశారు. నిత్యమూ ఫస్ట్ బస్ లను బయటకు తీసేవారు 3.30 గంటల సమయంలోనే డిపోలకు చేరుకోవడం గమనార్హం.

 ఇక దాదాపు రెండు నెలలుగా మూతబడిన టీఎస్ ఆర్టీసీ ఆన్ లైన్ రిజర్వేషన్ వెబ్ సైట్ ను నేడు తిరిగి తెరవనున్నామని అధికారులు వెల్లడించారు. సమ్మెలో పాల్గొన్న దాదాపు 50 వేల మంది ఉద్యోగులూ తిరిగి నేడు విధుల్లో చేరనుండటంతో, ఆర్టీసీ బస్సులు నేటి నుంచే పూర్తి స్థాయిలో తిరగనున్నాయి.

More Telugu News