తెలుగు మీడియం విద్యార్థులకు శుభవార్త.. జేఈఈ మెయిన్స్ ఇక తెలుగులో!

29-11-2019 Fri 07:04
  • సూత్రప్రాయంగా అంగీకరించిన కేంద్రం
  • 2021 నుంచి అమలు
  • తెలుగుతోపాటు మరిన్ని ప్రాంతీయ భాషల్లో..

తెలుగు మీడియం విద్యార్థులకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్‌డీ) శుభవార్త చెప్పింది. ఇకపై జేఈఈ మెయిన్స్‌ను తెలుగులో నిర్వహించేందుకు ఎంహెచ్ఆర్‌డీ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు పరీక్ష నిర్వహణపై నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ)కి ఆదేశాలు జారీ చేసింది.  2021లో నిర్వహించే పరీక్షల నుంచి ఈ నిర్ణయాన్ని కేంద్రం అమలు చేయనుంది.  

ప్రస్తుతం ఇంగిష్, హిందీ భాషల్లోనే జేఈఈ మెయిన్స్‌ను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ తాజా నిర్ణయంతో తెలుగుతోపాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, ఒరియా, తమిళం, ఉర్దూ భాషల్లోనూ నిర్వహించనున్నారు.