Telangana: ఆర్టీసీకి తక్షణ సాయం కింద రూ.100 కోట్లు ఇస్తాం: కేసీఆర్

  • ఆర్టీసీ కార్మికులంతా మా బిడ్డలే  
  • సమ్మె కాలంలో మృతి చెందిన కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగమిస్తాం
  • కార్మికులు క్రమశిక్షణతో మెలిగితే బోనస్ కూడా ఇస్తాం

ఆర్టీసీకి తక్షణ సాయం కింద రూ.100 కోట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ రోజు కేబినెట్ భేటీ అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు ఎలాంటి నిబంధనలు పెట్టమని స్పష్టం చేశారు. సమ్మె కాలంలో చనిపోయిన కార్మికుల కుటుంబంలోని ఒకరికి ఉద్యోగావకాశం కల్పిస్తామని చెప్పారు. యూనియన్లు లేకుంటే తమ తరఫున ఎవరు మాట్లాడతారని ఆర్టీసీ కార్మికులు భయపడాల్సిన అవసరంలేదన్నారు. ప్రతి డిపోకు వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఆర్టీసీ కార్మికులంతా తమ బిడ్డలేనని, యాజమాన్యం కార్మికులను వేధించకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కార్మికులు క్రమశిక్షణతో విధి నిర్వహణ చేస్తే.. సింగరేణి కార్మికులకు మాదిరే బోనస్ లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కార్మికులు తమ తప్పు తాము తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే సమ్మె పట్ల కఠినంగా వ్యవహరించానని చెప్పారు.

More Telugu News