Andhra Pradesh: అమరావతి నిర్మాణంపై చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించారు: మంత్రి బుగ్గన

  • రైతులను బెదిరించి భూములను లాక్కున్నారని ఆరోపణ
  • గ్రాఫిక్స్ లో అమరావతిని భూతల స్వర్గంగా చూపారు  
  • మా కిచ్చిన హామీలేమైనాయని రైతులు అడుగుతున్నారు

ఏపీలో గత ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజధానిలో రైతులను బెదిరించి చంద్రబాబు భూములు లాక్కున్నారని అన్నారు. గ్రాఫిక్స్ లో అమరావతిని భూతల స్వర్గంగా చూపారని, ఇప్పుడున్నఅమరావతిని చూస్తే మీకు పరిస్థితి అవగతమవుతుందని అన్నారు. ఇప్పుడు రైతులు తమకిచ్చిన హామీలేమైనాయని ప్రశ్నిస్తున్నారన్నారు. పైపెచ్చు తాము రాజధాని నిర్మాణానికి సహకరించడంలేదని అప్పట్లో టీడీపీ నేతలు ఆరోపించారు.

డ్రీమ్ కేపిటల్ అంటూ ఐదేళ్లు గ్రాఫిక్స్ తో గడిపారని ఎద్దేవా చేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ తో మహా నగరాన్ని కడతామని కాలం గడిపారని మండిపడ్డారు. అలా ఆలోచిస్తే ప్రపంచంలో ఎన్నో నగరాలు ఇప్పటికే నిర్మాణం జరిగేవన్నారు. ఐదేళ్లలో ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. రాజధానిపై నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయలేదని అడిగారు. చంద్రబాబు చెప్పిన దానికి, చేసే దానికి పొంతన లేదన్నారు. 40 ఏళ్ల అనుభవమంటే ఇదేనా? అని ప్రశ్నించారు.

More Telugu News