ATM: ఏటీఎంలలో ఇలాంటివి కూడా జరుగుతాయి... సీసీ కెమెరాకు చిక్కిన ఘటన!

  • క్యాష్ డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లిన వ్యక్తి
  • నగదు కంటే ముందు బయటికి వచ్చిన స్లిప్
  • ఆలస్యంగా బయటికి వచ్చిన డబ్బును చేజిక్కించుకున్న మరో వ్యక్తి

బ్యాంకుల నుంచి డబ్బు డ్రా చేయడానికి ఇప్పుడు ఎక్కువగా ఏటీఎంలపై ఆధారపడుతున్నారు. అయితే ఏటీఎంలలో ఎదురయ్యే సాంకేతిక సమస్యల గురించి సరైన అవగాహన లేకపోతే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో తెలిపే ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. జిల్లాలోని ముమ్మిడివరం మండలం ఇంజరం గ్రామవాసి కె.చిన్నబ్బాయి యూనియన్ బ్యాంకు ఏటీఎంకు వెళ్లాడు. రూ.10 వేలు డ్రా చేసేందుకు ఓకే బటన్ నొక్కాడు.

అయితే ముందుగా నగదు రావడానికి బదులు రసీదు స్లిప్ బయటికి వచ్చింది. క్యాష్ ఎంతకీ రాకపోవడంతో చిన్నబ్బాయి నిరాశతో ఏటీఎం వెలుపలికి వచ్చాడు. అయితే మెషీన్ నుంచి నగదు కాస్త ఆలస్యంగా బయటికి రాగా, అప్పుడే ఏటీఎంలోకి అడుగుపెట్టిన మరో వ్యక్తి అప్పనంగా ఆ నగదు చేజిక్కించుకుని అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ తతంగం ఏటీఎంలో అమర్చిన సీసీ కెమెరాలో నిక్షిప్తం కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

More Telugu News