BalaKrishna: షూటింగును పూర్తిచేసుకున్న 'రూలర్'

  • డిఫరెంట్ లుక్స్ తో బాలకృష్ణ
  • ముఖ్యమైన పాత్రలో భూమిక 
  • డిసెంబర్ 20వ తేదీన విడుదల

బాలకృష్ణ కథానాయకుడిగా 'రూలర్' నిర్మితమైంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలకృష్ణ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నారు. ఆయన సరసన నాయికలుగా సోనాల్ చౌహన్ .. వేదిక నటించారు. ఈ రోజుతో ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది.

ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలారు. బాలకృష్ణ - వేదిక కాంబినేషన్లోని ఈ పోస్టర్ ఆకర్షణీయంగా వుంది. ఇక రేపటి నుంచి నిర్మాణానంతర కార్యక్రమాలపై పూర్తి దృష్టిపెట్టనున్నారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 'జై సింహా' తరువాత బాలకృష్ణ - కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో వస్తోన్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి వుంది. ప్రకాశ్ రాజ్ .. జయసుధ .. భూమిక ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించిన సంగతి తెలిసిందే.

More Telugu News