Kiran: 'రాజావారు రాణిగారు' సెన్సార్ పూర్తి .. రిలీజ్ కి సిద్ధం

  • తెలుగు తెరకి మరో టీనేజ్ లవ్ స్టోరీ 
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
  • సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్

గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథలు ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఈ తరం కుర్రకారును ఊహల్లోకి .. నిన్నటితరం వారిని జ్ఞాపకాల్లోకి తీసుకెళుతుంటాయి. అలాంటి ప్రేమకథగా ప్రేక్షకులను పలకరించడానికి 'రాజావారు రాణిగారు' రెడీ అవుతోంది. కిరణ్ - రహస్య జంటగా నటించిన ఈ సినిమా రేపు థియేటర్లకు రానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ను మంజూరు చేశారు. రవికిరణ్ కోలా దర్శకత్వం వహించిన ఈ సినిమాను, సురేశ్ ప్రొడక్షన్స్ వారు విడుదల చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ కి .. ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా తప్పకుండా తమకి సక్సెస్ ను ఇస్తుందనే నమ్మకంతో టీమ్ వుంది. ఆ నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.

More Telugu News