Jagan: మహారాష్ట్ర రాజకీయాలపై జగన్ కామెంట్.. డిప్యూటీ సీఎం పదవి గురించి మాట్లాడిన ఏపీ సీఎం!

  • ఈ రోజు ఉదయం నేను వ్యాయామం చేస్తూ టీవీ చూశాను
  • కాంగ్రెస్ పార్టీకి స్పీకరట.. ఎన్సీపీకి ఒక డిప్యూటీ సీఎం అట
  • అంతలావు మహారాష్ట్రకు ఒకే ఒక్క డిప్యూటీ సీఎం
  • ఏపీలో మాత్రం ఐదుగురు డిప్యూటీ సీఎంలు

మహారాష్ట్రలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రం డిప్యూటీ సీఎం పదవి సర్దుబాటు గురించి ఆయన మాట్లాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి పురస్కరించుకొని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.

'అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం ఒక అడుగు ముందుకు వేశాం. ఎవరూ ఊహించని విధంగా మంత్రి వర్గ కూర్పులో దాదాపుగా 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను తీసుకొచ్చాం. ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించాం. ఈ రోజు ఉదయం నేను వ్యాయామం చేస్తూ టీవీలో చూశాను. మహారాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుందో టీవీలో చూపించారు. కాంగ్రెస్ పార్టీకి స్పీకరట.. ఎన్సీపీకి ఒక డిప్యూటీ సీఎం అట..  అంతలావు మహారాష్ట్రకు ఒకే ఒక్క డిప్యూటీ సీఎం. మన మంత్రి వర్గంలో మాత్రం ఐదుగురు డిప్యూటీ సీఎంలు. వీరిలో నలుగురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన వారే ఉన్నారు. ఎప్పుడూ ఎక్కడా చూడని విధంగా బీసీల సంక్షేమానికి మేము నిధులు కేటాయించాం' అని జగన్ చెప్పారు.  
.

More Telugu News