Rahul Gandhi: ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసి నా సమయాన్ని వృథా చేసుకోను!: రాహుల్ గాంధీ

  • లోక్ సభలో ప్రజ్ఞా ఠాకూర్ వ్యాఖ్యలపై రాహుల్ స్పందన 
  • ఆమె చేస్తోన్న వ్యాఖ్యలు బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలానికి నిదర్శనం
  • వారి తీరు బయటపడకుండా ఉండదు
  • దీనిపై నేను ఏ విధంగా స్పందించాలి?  

మహాత్మా గాంధీని కాల్చిచంపిన నాథూరామ్ గాడ్సేని బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్... దేశ భక్తుడుగా అభివర్ణించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. 'ఆమె చేస్తోన్న వ్యాఖ్యలు బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలానికి నిదర్శనం. వారి తీరు బయటపడకుండా ఉండదు. దీనిపై నేను ఏ విధంగా స్పందించాలి? ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నా సమయాన్ని నేను వృథా చేసుకోను' అని అన్నారు.  

కాగా, స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ) సవరణ బిల్లుపై నిన్న లోక్‌సభలో చర్చ జరిగింది. మహాత్మా గాంధీని ఎందుకు చంపాల్సి వచ్చిందో గాడ్సే స్వయంగా చెప్పిన మాటలను డీఎంకే సభ్యుడు ఎ.రాజా ప్రస్తావిస్తుండగా.. ప్రజ్ఞా ఠాకూర్ మధ్యలో మాట్లాడారు. ఒక దేశభక్తుడి వ్యాఖ్యలను ఉదాహరణగా చెప్పనక్కర్లేదంటూ ఆమె వ్యాఖ్యానించారు.

More Telugu News