Balakrishna: ఫ్యామిలీ పార్టీలో డ్యాన్స్ ఇరగదీసిన బాలకృష్ణ... వీడియో ఇదిగో!

  • కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేసిన బాలయ్య
  • వైరల్ అయిన మాస్ డ్యాన్స్
  • ప్రస్తుతం 105వ చిత్రం చేస్తున్న బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ, స్టెప్పులెలా ఇరగదీస్తారో అందరికీ తెలిసిందే. ఆయన నటించిన ఎన్నో సినిమాల్లోని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. తాజాగా ఆయన, ఓ ఫ్యామిలీ పార్టీలో వేసిన మాస్ డ్యాన్స్ ఇప్పుడు వైరల్ గా మారింది. కుటుంబ సభ్యులంతా చప్పట్లతో ప్రోత్సహిస్తుంటే, బాలయ్య తనదైన శైలిలో స్టెప్పులేస్తూ ఆ పార్టీకి మరింత జోష్ తెచ్చారు.

ప్రస్తుతం బాలకృష్ణ, తన 105వ చిత్రంగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో 'రూలర్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తదుపరి ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకూ అంగీకరించారు. ఈ చిత్రంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాతో పాటు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సైతం నటిస్తారని తెలుస్తోంది.

More Telugu News