Venkatesh: 'అసురన్' తెలుగు రీమేక్ లో వెంకీ సరసన శ్రియ

  • తమిళంలో హిట్ కొట్టిన 'అసురన్'
  • సురేశ్ బాబు చేతికి తెలుగు రీమేక్ హక్కులు 
  • కొత్తవారికి ప్రాధాన్యతనిస్తున్న దర్శక నిర్మాతలు  

ధనుశ్ హీరోగా ఇటీవల తమిళంలో వచ్చిన 'అసురన్' అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది. వైవిధ్యభరితమైన చిత్రంగా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అలాంటి ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సురేశ్ బాబు దక్కించుకున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్ కథానాయకుడిగా ఈ సినిమాను నిర్మించడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఈ సినిమాలో వెంకటేశ్ సరసన నాయికగా 'శ్రియ'ను తీసుకోనున్నారని సమాచారం. ఇక మిగతా పాత్రలకిగాను దాదాపు కొత్త ఆర్టిస్టులనే తీసుకోనున్నారు. అందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ పనులన్నింటినీ కూడా శ్రీకాంత్ అడ్డాల దగ్గరుండి చూసుకుంటున్నాడని చెబుతున్నారు. అన్నీ సెట్ కాగానే అప్పుడు ప్రకటన వెలువడుతుందని అంటున్నారు.

More Telugu News