Uddhav Thackeray: ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం 6 నెలల్లో కుప్పకూలుతుంది: ముంబై జ్యోతిష్కుడు

  • మూడు పార్టీల మధ్య విభేదాలు వస్తాయి
  • థాకరే ప్రమాణస్వీకారం సమయం మంచిది కాదు
  • 3 పార్టీలు భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలను కోల్పోతాయి

మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ఈ సాయంత్రం ముంబైలోని శివాజీ పార్కులో సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో, ముంబైకి చెందిన సుశీల్ చతుర్వేది అనే జ్యోతిష్కుడు మాట్లాడుతూ... ఈ ప్రభుత్వానిది మూడునాళ్ల ముచ్చటేనని జోస్యం చెప్పారు. 6 నెలల్లో ఈ ప్రభుత్వం కుప్పకూలుతుందని... వచ్చే ఏడాది ఏప్రిల్ కంటే ఎక్కువ కాలం పాలన సాగించలేదని చెప్పారు.

ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీల మధ్య విభేదాలు తలెత్తుతాయని చతుర్వేది తెలిపారు. ఇది తీవ్ర రూపం దాల్చి, చివరకు ప్రభుత్వ పతనానికి కారణమవుతుందని చెప్పారు. ఈరోజు సాయంత్రం 6.40 గంటలకు ఉద్ధవ్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారని... ఈ సమయం రాహు, కేతువుల మధ్య పడుతోందని, ఇది మంచి సమయం కాదని తెలిపారు. ఆ సమయంలో గ్రహబలం థాకరేకు ప్రతికూలంగా ఉంటుందని చెప్పారు. మరోవైపు రానున్న రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీలు భారీ సంఖ్యలో తమ ఎమ్మెల్యేలను కోల్పోతాయని జోస్యం చెప్పారు.

More Telugu News