Naga Shourya: నాగశౌర్య సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్

  • అన్యాయాన్ని ప్రశ్నించే హీరోగా నాగశౌర్య 
  •  ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న శ్రీచరణ్ పాకాల సంగీతం
  • తొలిసారి నాగశౌర్యతో జోడీకడుతున్న మెహ్రీన్

కొంతకాలంగా నాగశౌర్యకి సరైన హిట్ పడలేదు. దాంతో కథలపై ఆయన మరింత శ్రద్ధ పెట్టాడు. తన సొంత బ్యానర్లో 'అశ్వత్థామ' సినిమా చేస్తున్నాడు. మెహ్రీన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. రమణతేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి, కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు.

రేపు (శుక్రవారం) సాయంత్రం 4:05 నిమిషాలకి కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ ను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. అన్యాయాన్ని ప్రశ్నించే డైనమిక్ హీరోగా ఈ సినిమాలో నాగశౌర్య కనిపించనున్నాడని అంటున్నారు. శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని చెబుతున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా సక్సెస్ ను ఇస్తుందనే నమ్మకంతో నాగశౌర్య వున్నాడు.

More Telugu News