India: పాకిస్థాన్ నుంచి వచ్చిన 21 మంది హిందువులకు భారత పౌరసత్వం!

  • జైపూర్‌కు వలస వచ్చిన భారతీయులకు పౌరసత్వం
  • ఉత్తర్వులు జారీ చేసిన జైపూర్ కలెక్టర్
  • వలస వచ్చిన 1310 మందికి పౌరసత్వం ఇవ్వనున్న ప్రభుత్వం

రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్‌ నుంచి వచ్చిన 21 మంది హిందువులకు భారత పౌరసత్వం కల్పించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పాకిస్థాన్‌ నుంచి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్, జైసల్మేర్, జైపూర్ జిల్లాలకు వలస వచ్చిన 1310 మందికి భారత పౌరసత్వం ఇవ్వనున్నట్టు ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభలో ప్రకటించారు.

కాగా, ఈ ఏడాది జనవరి 8న భారత ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం.. 31 డిసెంబరు 2014లోపు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి భారత్‌కు వలస వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం ఇవ్వనున్నారు. తాజాగా, ఇందులో భాగంగానే జైపూర్ కలెక్టర్ 21 మంది పాక్ హిందువులకు పౌరసత్వం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

More Telugu News