Sivasena: శివసేన భవన్ పై దర్శనమిచ్చిన ఇందిరాగాంధీ ఫొటో!

  • నేడు కొలువుదీరనున్న సంకీర్ణ కూటమి
  • మరాఠా చరిత్రలో తొలిసారి శివసేనకు సీఎం పదవి
  • ఆనందం వ్యక్తం చేస్తున్న పార్టీ కార్యకర్తలు

మహారాష్ట్రలో నేడు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలతో కూడిన 'మహా వికాస్ అఘాడీ' పాలనా పగ్గాలు చేపట్టనున్న తరుణంలో శివసేన ప్రధాన కార్యాలయంపై వెలిసిన ఓ పోస్టర్ అందరినీ ఆకర్షిస్తోంది. పలువురు నేతల చిత్రాలతో పాటు గతంలో బాల్ థాకరే, ఇందిరా గాంధీలు కలిసున్న చిత్రాలను ఇందులో ముద్రించారు. ఇద్దరు దివంగత నేతలూ, ఒకరికి ఒకరు అభివాదం చేసుకుంటున్న చిత్రం ఈ పోస్టర్ పై కనిపిస్తోంది. ఇక దీనిపై, "బాలాసాహెబ్ థాకరే కల నెరివేరింది. ఓ శివ సైనికుడు ముఖ్యమంత్రి అవుతున్నారు" అన్న క్యాప్షన్ ఉంచారు.

కాగా, బాల్ థాకరే జీవించి ఉన్న సమయంలో ఎన్నోమార్లు ఇందిరాగాంధీకి మద్దతుగా నిలిచారు. 1975లో దేశమంతా వ్యతిరేకించిన అత్యయిక స్థితిని థాకరే సమర్థించారు. 1965లో మరాఠీల అభ్యున్నతి లక్ష్యంగా శివసేన పార్టీ ప్రారంభం కాగా, ఆ పార్టీకి చెందిన నాయకుడు ముఖ్యమంత్రి కావడం మాత్రం ఇదే తొలిసారి కావడంతో, ఆ పార్టీ నేతలు, కార్యకర్తల ఆనందానికి అవధులు లేవు.

More Telugu News