Jammu And Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులు పూర్తిగా తగ్గిపోయాయి: రాజ్‌నాథ్ సింగ్

  • ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్నాం
  • జమ్మూకశ్మీర్ మినహా దేశంలో ఎక్కడా పెద్ద ఘటనలు జరగలేదు
  • ఆర్మీ, పారామిలటరీ, జమ్మూకశ్మీర్ పోలీసులు కలసి పనిచేస్తున్నారు

గతంతో పోలిస్తే జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులు గణనీయంగా తగ్గాయని కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడులపై కాంగ్రెస్ సభ్యుడు సురేశ్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులు దాదాపు సున్నాకు చేరుకున్నాయని అన్నారు. ఆర్మీ, పారామిలటరీ, జమ్మూకశ్మీర్‌ పోలీసులు కలిసి ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్నారని అన్నారు.

జమ్మూకశ్మీర్‌లో మినహా గత ఐదేళ్లలో దేశంలో ఎక్కడా పెద్ద ఘటనలు జరగలేదన్నారు. రాజ్‌నాథ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ సురేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయంటూ ప్రభుత్వం ఊదరగొడుతూ, సభను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు.

More Telugu News