Asia Archery ChampionShip: స్వర్ణంతో మెరిసిన భారత ఆర్చర్లు

  • బ్యాంకాక్ వేదికగా సాగిన ఆసియా ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీలు
  • భారత్ ఖాతాలో ఇప్పటివరకు ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు
  • స్వతంత్ర క్రీడాకారులుగా పాల్గొన్న భారత ఆర్చర్లు

బ్యాంకాక్ వేదికగా సాగుతున్న 21వ ఆసియా ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో భారత ఆర్చర్లు తాజాగా స్వర్ణ పతకం గెలుచుకున్నారు. కాంపౌడ్ మిక్స్ డ్ ఈవెంట్ ఫైనల్లో తెలుగు అమ్మాయి ఆర్చర్ జ్యోతి సురేఖ వెన్నెం-అబిషేక్ వర్మ జోడీ పసిడిని గెలుపొందింది. భారత ఆర్చరీ సమాఖ్యపై నిషేధం ఉన్న నేపథ్యంలో భారత ఆర్చర్లు స్వతంత్ర క్రీడాకారులుగా టోర్నీలో పాల్గొన్నారు.  ఫైనల్లో, జ్యోతి సురేఖ వెన్నెం-అబిషేక్ వర్మ జోడీ చైనీస్ తైపీ జోడీని 158-151 పాయింట్ల తేడాతో ఓడించింది. కాంపౌండ్ టీమ్ విభాగంలో పురుషుల జట్టు కొరియా జట్టు చేతిలో ఓడి రజతంతో సంతృప్తి పడగా, మహిళల జట్టు కొరియా చేతిలో పరాజయం పాలైంది. మొత్తానికి భారత్ ఆర్చర్లు ఇప్పటివరకు ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో  మొత్తం ఏడు పతకాలను సాధించారు.

More Telugu News