Tirupati: తిరుపతి ఎయిర్ పోర్టులో సరికొత్త వీఐపీ లాంజ్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

  • ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ నిర్ణయం
  • ఇందుకోసం 1800 చదరపు మీటర్ల భూమి కేటాయింపు
  • ఏడాదికి రూపాయి లైసెన్స్ ఫీజుతో 15 ఏళ్లకు లీజు

తిరుపతి విమానాశ్రయం త్వరలో కొత్త సొబగులను సంతరించుకోనుంది. విమానాశ్రయంలో సరికొత్త వీఐపీ లాంజ్ ఏర్పాటుకు కేంద్ర కేబినేట్ ఓకే చెప్పింది. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భేటీ అయిన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎయిర్ పోర్టు అథారిటీకి చెందిన 1800 చదరపు మీటర్ల భూమిని ఏపీ విద్య,సంక్షేమ,మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ కు కేటాయించేందుకు కేబినెట్ అంగీకరించింది. ఈ భూమిలోనే వీఐపీ లాంజ్ నిర్మాణం చేయనున్నారు. ఈ భూమిని ఏడాదికి రూపాయి లైసెన్స్ ఫీజుతో 15 ఏళ్ల పాటు ఇవ్వాలని నిర్ణయించింది. 

More Telugu News