Maharashtra: మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీని మారుస్తారంటూ ఊహాగానాలు!

  • రాజస్థాన్ గవర్నర్ మిశ్రాకు మహారాష్ట్ర గవర్నర్ గా అదనపు బాధ్యతలు?
  • మహారాష్ట్ర రాజకీయాలపై విమర్శలతో నిర్ణయం?
  • రేపు ఉద్ధవ్ ప్రమాణ స్వీకారం

మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో మలుపుల అనంతరం చివరకు శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సిద్ధమైన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్ కోష్యారీని మారుస్తారని ప్రచారం జరుగుతోంది.

రాజస్థాన్ గవర్నర్  కల్ రాజ్ మిశ్రాకు మహారాష్ట్ర గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలతో బీజేపీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీకి గడువు ఇవ్వడం, కొన్ని గంటల్లోనే  రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.

అనంతరం రాత్రికి రాత్రే రాష్ట్రపతి పాలన ఎత్తివేయడం, ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ తో ప్రమాణ స్వీకారం చేయించడం వంటి కీలక పరిణామాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ పరిణామాల పర్యవసానంగా మహారాష్ట్ర గవర్నర్ ను మార్చుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

More Telugu News