Maharashtra: మెజారిటీ నిరూపించుకోండి: ఉద్ధవ్ కు మహారాష్ట్ర గవర్నర్ లేఖ

  • ఉద్ధవ్ కోరినట్లుగానే రేపు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తాను 
  • బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలి
  • లేదంటే ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలి

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రేపు శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయనకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఈ రోజు ఓ లేఖ పంపారు. ఉద్ధవ్ కోరినట్లుగానే రేపు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తానని చెప్పారు. వారం రోజుల్లోగా అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోవాలని తెలిపారు. బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోగా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలని సూచించారు.

కాగా, తన భార్య రష్మీతో కలిసి ఈ రోజు ఉద్ధవ్ థాకరే... మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీతో సమావేశమైన విషయం తెలిసిందే. గవర్నర్ తో ఉద్ధవ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారని శివసేన నేతలు అంటున్నారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో రేపు సాయంత్రం 6.40 గంటలకు దాదర్ లోని శివాజీపార్క్ లో ఉద్ధవ్.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

More Telugu News