Sundeep Kishan: ఉదయ్ కిరణ్ బయోపిక్ గురించి క్లారిటీ ఇచ్చిన సందీప్ కిషన్

  • ఉదయ్ కిరణ్ బయోపిక్ అంటూ వార్తలు 
  • హీరోగా తెరపైకి సందీప్ కిషన్ పేరు 
  • తనని సంప్రదించలేదన్న సందీప్ కిషన్ 

యువ కథానాయకుడిగా వరుస హిట్లతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఉదయ్ కిరణ్, ఆ తరువాత అవకాశాలు లేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అలాంటి ఉదయ్ కిరణ్ బయోపిక్ ను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, ఇందులో ఉదయ్ కిరణ్ పాత్రను సందీప్ కిషన్ చేయనున్నాడనే వార్తలు కొన్ని రోజులుగా షికారు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని గురించి సందీప్ కిషన్ స్పందించాడు. "ఉదయ్ కిరణ్ బయోపిక్ లో నేను చేస్తున్నట్టుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టును గురించి ఇంతవరకూ నన్ను ఎవరూ సంప్రదించలేదు. అందువలన ఈ వార్తలో నిజం లేదు. బయోపిక్ లు చేయాలన్న ఇంటెన్షన్ కూడా నాకు లేదు" అంటూ తన వైపు నుంచి క్లారిటీ ఇస్తూ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు.

More Telugu News