shamshabad: ఈ సీజన్ లో తొలిసారి కమ్మేసిన పొగమంచు... హైదరాబాద్ లో నిలిచిన పలు విమానాలు!

  • 4 విమానాల దారి మళ్లింపు
  • రెండు గంటల తరువాత విమాన సర్వీసులు
  • హైవేపై నిదానంగా నడుస్తున్న వాహనాలు

ప్రస్తుత శీతాకాల సీజన్ లో తొలిసారిగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. ముఖ్యంగా శంషాబాద్ లోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దట్టంగా పొగమంచు పేరుకుపోవడంతో పలు విమానాలు నిలిచిపోయాయి. ల్యాండింగ్ కావాల్సిన విమానాలను బెంగళూరు, ముంబైకి మళ్లించాల్సి వచ్చింది.

విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, రాజమహేంద్రవరం విమాన సర్వీసులను రెండు గంటలు ఆలస్యంగా నడిపిస్తామని అధికారులు అంటున్నారు. ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాలను పొగమంచు తేరుకోగానే టేకాఫ్ కు అనుమతిస్తామని చెబుతున్నారు. నాలుగు విమాన సర్వీసులను దారి మళ్లించామని  తెలిపారు.

మరోపక్క, శంషాబాద్ వద్ద జాతీయ రహదారిపైన, ఔటర్ రింగ్ రోడ్డుపైనా వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. 30 నుంచి 40 మీటర్ల ముందు ఉన్న వాహనం కూడా కనిపించడం లేదని డ్రైవర్లు వెల్లడించారు.

More Telugu News