Amitabh Bachchan: తేజకు బంపరాఫర్... అమితాబ్ తో సినిమా చేసే చాన్స్!

  • ఆర్టికల్ 370 కథాంశంగా చిత్రం
  • నటించేందుకు అమితాబ్ అంగీకారం
  • త్వరలోనే షూటింగ్ మొదలు!

టాలీవుడ్ లో ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన తేజ, ఇప్పుడు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను డైరెక్ట్ చేసే చాన్స్ కొట్టేసినట్టు టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన 'ఆర్టికల్ 370' కథాంశంగా తేజ, ఓ స్టోరీని సిద్ధం చేయగా, ఇందులో నటించేందుకు అమితాబ్ రెడీగా ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు గోవాలో మొదలయ్యాయని, ఓ ప్రముఖ నిర్మాత దీన్ని నిర్మిస్తున్నారని, త్వరలోనే షూటింగ్ కూడా మొదలవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.

More Telugu News