Telugudesam Leader Kuna Ravi kumar criticism againgst speaker Tammineni Sitharam: రాజ్యాంగబద్ధ పదవుల మర్యాదను కాపాడకుంటే.. ప్రజాస్వామ్యంలో తిరుగుబాటు వస్తుంది: కూన రవికుమార్

  • నాకు రాజ్యాంగ పదవుల పరిధులు బాగా తెలుసు
  • తమ్మినేని ఒక శాసన సభ్యుడిగా మాట్లాడితే, అక్కడ స్పీకర్ కు అవమానం ఏమిటి?
  • సోనియా గాంధీ గురించి మీరు బూతులు మాట్లాడారు 

రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఆ బాధ్యతలను కాపాడలేనప్పుడు ప్రజాస్వామ్యంలో తిరుగుబాటు వస్తుందని టీడీపీ నేత కూన రవికుమార్ అన్నారు.  అది ఒకరితో ప్రారంభమై రేపు వందలు, వేలుగా మారుతుందన్నారు. తనతో పాటు కొంతమంది తన పార్టీ నేతలపై అసెంబ్లీ కార్యదర్శి ప్రివిలెజ్ నోటీసులు జారీ చేసిన అనంతరం కూన మీడియాతో మాట్లాడారు.

‘శాసన వ్యవస్థలో వ్యక్తులకు ఉండవలసిన గౌరవాలు, శాసన సభ్యులకు ఉన్న పరిధులు, స్పీకర్ కు ఉన్న బాధ్యతలు-పరిధులు, మాజీ శాసన సభ్యులకుండాల్సిన పరిధులు ప్రభుత్వ విప్ గా పనిచేసిన నాకు బాగా తెలుసు. మాకు నోటీసులు జారీచేయడంపై కార్యదర్శి జోగి రమేష్ ను ప్రశ్నిస్తున్నా... తమ్మినేని స్పీకర్ కాకుండా ఒక శాసన సభ్యుడిగా మాట్లాడుతున్నానని చెప్పారు. మరి అక్కడ స్పీకర్ కు అవమానం చేశారనడం ఎంతవరకు సమంజసం? నేను నా మాటకు కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు అదే అంటున్నాను. తమ్మినేని సీతారాం తప్పతాగి మాట్లాడుతున్నారు. ఈ రోజు సోనియా గాంధీ గురించి బూతులు మాట్లాడారు. ఇటువంటి వ్యక్తి స్పీకర్ గా ఉండదగిన వ్యక్తేనా? ప్రజలను అడుగుతున్నాను’ అని కూన రవికుమార్ ప్రశ్నించారు. 

More Telugu News