Gold prices fell In India and Hyderabad: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

  • హైదరాబాద్ లో రెండో రోజు స్వల్పంగా తగ్గిన పసిడి ధర
  • దేశ వ్యాప్తంగా చూస్తే.. వరుసగా ఆరో రోజు తగ్గుదల
  • విదేశీ కరెన్సీతో పోలిస్తే.. రూపాయి విలువ పెరగడమే కారణం

దేశంలో వరుసగా ఐదు రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు నేడు ఆరో రోజు కూడా స్వల్పంగా తగ్గాయి. విదేశీ కరెన్సీ తో పోలిస్తే  రూపాయి విలువ పెరగడంతో బంగారం ధరలు ఈ రోజు తగ్గాయి. మల్టీ కమాడిటీ ఎక్చేంజ్ ఇండియా వద్ద డిసెంబర్ లో డెలివరీ కావాల్సిన గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.20 శాతం పడిపోయి.. రూ.37,650 (10గ్రాములు)కు చేరింది. మరోవైపు వెండి ధరలు కూడా క్షీణించాయి. మల్టీ కమాడిటీ ఎక్చేంజ్ ఇండియా వద్ద కిలో వెండి ధర 0.45 శాతం తగ్గి రూ.44,036 కు చేరింది.

ఇక, హైదరాబాద్ లో కూడా వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధరతో పోలిస్తే రూ.120 తగ్గి రూ.36,130 పలికింది. 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధరతో పోలిస్తే.. రూ.140 తగ్గి రూ.39,410 పలికింది.

More Telugu News