KRKR: కులాల మధ్య చిచ్చుపెట్టేలా ఉందంటూ 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' చిత్రంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్

  • వివాదాల్లో వర్మ కొత్త చిత్రం
  • ఈ నెల 29న వస్తున్న కమ్మరాజ్యంలో కడపరెడ్లు
  • హైకోర్టులో రేపు విచారణ

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుంచి వస్తున్న తాజా చిత్రం కమ్మరాజ్యంలో కడపరెడ్లు. ఈ చిత్రం టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే వివాదాల రంగు పులుముకుంది. తాజాగా, ఇంద్రసేనా చౌదరి అనే వ్యక్తి కమ్మరాజ్యంలో కడపరెడ్లు చిత్రం కులాల మధ్య చిచ్చుపెట్టే అవకాశముందని, సినిమా విడుదల నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా రిలీజ్ అయితే కమ్మ, రెడ్డి కులస్తుల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొనే అవకాశం ఉందని పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు రేపు విచారణ జరపాలని నిర్ణయించింది. కాగా, ఈ సినిమా నవంబరు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News