Chiranjeevi: ఆ సినిమా నుంచే చిరంజీవి 'డైనమిక్' హీరో అయ్యారు: నటుడు నారాయణరావు

  • చిరంజీవితో కలిసి నటించాను 
  •  ఆయనతో 'దేవాంతకుడు'నిర్మించాను 
  • అప్పుడు చిరంజీవి ఆ మాట అన్నారన్న నారాయణరావు

తెలుగులో నారాయణరావు అనేక చిత్రాల్లో నటించారు. నారాయణరావు పేరు వినగానే 'అంతులేని కథ' సినిమాలోని 'తాళికట్టు శుభవేళ' అనే పాట గుర్తొస్తుంది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .." చిరంజీవితో కలిసి నేను కొన్ని సినిమాల్లో నటించాను. ఆ తరువాత ఆయనతో 'దేవాంతకుడు' సినిమాను నిర్మించాను. ఆ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది.

నాతో పాటు సుధాకర్ - హరిప్రసాద్ కూడా చిరంజీవికి మంచి స్నేహితులు. వాళ్లకి కూడా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో తనతో మరో సినిమా చేసుకోమని చిరంజీవి అన్నారు. దాంతో మేము ముగ్గురం కలిసి చిరంజీవితో 'యముడికి మొగుడు' సినిమాను నిర్మించాము. 'డైనమిక్ మూవీ మేకర్స్' అనే బ్యానర్లో ఆ సినిమా చేస్తూ, చిరంజీవికి 'డైనమిక్' హీరో అనే బిరుదును ఇచ్చింది కూడా మేమే. ఆ సినిమా ఏ స్థాయిలో విజయవిహారం చేసిందో అందరికీ తెలిసిందే" అని చెప్పారు.

More Telugu News