Dresden Green Vault Museum: భారీ దోపిడీ... రూ. 7,800 కోట్ల విలువైన వజ్రాలు, నగలను దోచుకెళ్లిన దొంగలు

  • జర్మనీలోని డ్రెస్టన్ మ్యూజియంలో భారీ దొంగతనం  
  • వందల ఏళ్లనాటి విలువైన సంపద చోరీ
  • యూరప్ దేశాల్లో కలకలం రేపుతున్న ఘటన 

దాదాపు రూ. 7,800 కోట్ల విలువైన వజ్రాలు, నగలను దోపిడీ చేసిన దొంగలు... క్షణాల్లో ఆడీ కారులో పరారయ్యారు. ఈ ఘటన జర్మనీలోని అత్యంత ప్రముఖ డ్రెస్డన్ మ్యూజియంలో చోటు చేసుకుంది. జర్మనీ మ్యాజియంల చరిత్రలో ఇదే అతిపెద్ద చోరీ. నిన్న జరిగిన ఈ భారీ దోపిడీ యూరప్ దేశాల్లో కలకలం రేపుతోంది. కొన్ని వందల సంవత్సరాలనాటి విలువైన వజ్రాలు, నగలను కూడా దొంగలు దోచుకెళ్లారు.

మ్యూజియంలోని గ్రీన్ వాలెట్ భవనంలో ఈ చోరీ జరిగింది. ఈ భవనానికి అత్యంత కట్టుదిట్టమైన ఎలక్ట్రానిక్ భద్రతా వ్యవస్థ ఉంది. సమీపంలో ఉన్న అగస్టీన్ వంతెన కింద నుంచి ఈ భవనానికి విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన దొంగలు... వంతెన కింద ఉన్న విద్యుత్ సరఫరా వ్యవస్థకు నిప్పు పెట్టారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన తర్వాత... గ్రీన్ వాలెట్ భవనంలో ఉన్న ఓ కిటికీని బద్దలు కొట్టి లోపలకు ప్రవేశించారు.

బరువైన, పెద్ద వస్తువుల జోలికి వెళ్లకుండా... అత్యంత విలువైన వజ్రాలు, చిన్న సైజులో ఉన్న అత్యంత ఖరీదైన నగలను మాత్రమే దోచుకుని... అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న ఆడీ కారులో పరారయ్యారు. అలారం మోగడంతో అప్రమత్తమైన పోలీసులు మ్యూజియం నుంచి వెళ్లే మార్గాన్ని మొత్తం మూసేశారు. కానీ అప్పటికే చోరాగ్రేశులు ఎవరికీ దొరక్కుండా వెళ్లిపోయారు. దొంగలను పట్టుకునేందుకు 20 మంది నేర నిపుణులు, దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి.

దొంగలు ఎత్తుకెళ్లిన వాటిలో ఇవి కొన్ని

More Telugu News