Nirbhaya: నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు వ్యవహారం.. కేసు మరో న్యాయమూర్తికి బదిలీ

  • ఉరిశిక్షను వేగంగా అమలు చేయడంపై కేసు
  • బాధితురాలి తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు కేసు బదిలీ
  • ఈ నెల 28న విచారణ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'నిర్భయ' హంతకులకు ఉరిశిక్ష కేసును ఢిల్లీ కోర్టు మరో న్యాయమూర్తికి బదిలీ చేసింది. నిర్భయ కేసు దోషులు ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. వీరికి ఉరిశిక్ష అమలుపై గత కొంతకాలంగా తర్జనభర్జన జరుగుతోంది. ఉరిశిక్షను వీరికి వేగంగా అమలు చేయాలా? వద్దా? అన్న కేసును బాధితురాలి తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు అడిషనల్ సెషన్స్ జడ్జి సతీశ్ అరోరాకు ఢిల్లీ కోర్టు బదిలీ చేసింది.

ఇప్పటి వరకు ఈ కేసు న్యాయమూర్తి యశ్వంత్ కుమార్ పరిధిలో ఉంది. కాగా, ఈ కేసుపై ఈ నెల 28న విచారణ జరగనుంది. పాటియాలా కోర్టులో లైంగిక వేధింపుల కేసులను విచారించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉన్నా, ఇప్పటి వరకు అక్కడ న్యాయమూర్తిని నియమించలేదు. దీంతో దోషులకు న్యాయపరంగా ఉన్న అన్ని మార్గాలు మూసుకుపోయినట్టు అయింది.

More Telugu News