IIM Ahmedabad: జగన్ అవినీతిపైనా అధ్యయనం చేయండి: ఐఐఎం అహ్మదాబాద్ కు కళా వెంకట్రావు బహిరంగ లేఖ

  • అవినీతి నిర్మూలనకు ఐఐఎం అహ్మదాబాద్ తో ఏపీ సర్కారు ఒప్పందం
  • విమర్శల వర్షం కురిపిస్తున్న టీడీపీ నేతలు
  • జగన్ అవినీతికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు

వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలనకు ఐఐఎం అహ్మదాబాద్ తో వైసీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడంపై టీడీపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఐఐఎం అహ్మదాబాద్ కు బహిరంగ లేఖ రాశారు. పనిలోపనిగా జగన్ అవినీతిపైనా అధ్యయనం చేయాలని కోరారు. జగన్ పై 31 క్రిమినల్ కేసులతో పాటు సీబీఐ విచారణ కూడా కొనసాగుతోందని లేఖలో పేర్కొన్నారు.

జగన్ ఎన్నో సూట్ కేసు కంపెనీలు ఏర్పాటు చేసి వేల కోట్ల రూపాయలు మళ్లించారని ఆరోపించారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని జగన్ అవినీతికి పాల్పడ్డాడని వివరించారు. సీఎం అయ్యాక ఇసుక, మద్యం, మైనింగ్ లో భారీస్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అంతేగాకుండా, ఐఐఎం అధ్యయనానికి పూర్తి సహకారం అందిస్తామని కళా వెంకట్రావు తన లేఖలో పేర్కొన్నారు.

More Telugu News