Jabardasth: మొదట్లో ‘జబర్దస్త్’ 25 ఎపిసోడ్సే చేయాలనుకున్నారు: నాగబాబు

 

  • ‘జబర్దస్త్’ ఇంత లాంగ్ షో చేయాలనుకోలేదు
  • తొలి ఎపిసోడ్ తోనే ‘జబర్దస్త్’కు మంచి పేరొచ్చింది
  • ‘జబర్దస్త్’లో టాలెంట్ ఒక్కరోజులో వచ్చింది కాదు 

కామెడీ షో ‘జబర్దస్త్’ నుంచి ప్రముఖ నటుడు నాగబాబు తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ షో నుంచి ఆయన బయటకు వెళ్లడం వెనుక వున్న కారణాలను నాగబాబు వివరించారు. ‘మై ఛానెల్ నా ఇష్టం’లో ఆయన మాట్లాడుతూ, గతంలో ‘అదుర్స్’ అనే షోకు జడ్జిగా చేశానని, ఆ షో నిర్వాహకులతో తనకు సాన్నిహిత్యం వుండేదని అన్నారు. ఆ తర్వాత ఓ కామెడీ షో (జబర్దస్త్) చేస్తున్నామని, దానికి జడ్జిగా వుండాలని శ్యాంప్రసాద్ రెడ్డి కోరారని గుర్తుచేసుకున్నారు. ‘ఎవరికీ తెలియని విషయం ఏంటంటే.. ఇది (జబర్దస్త్) ఇంత లాంగ్ షో చేద్దామని ఎవరికి ఐడియా లేదు’ అని అన్నారు.

రోజాను, తనను జడ్జిలుగా వుండాలని కోరారని, అందుకు తాము ఒప్పుకున్నామని అన్నారు. ‘జబర్దస్త్’ను 25 ఎపిసోడ్స్ వరకే చేస్తారన్న విషయం మేనేజర్ ఏడుకొండలు ద్వారా తనకు తెలిసిందని అన్నారు. మొదటి ఎపిసోడ్ తోనే ‘జబర్దస్త్’కు మంచి పేరు వచ్చిందని, టీఆర్పీ కూడా లభించిందని, దాంతో ఇరవై ఐదు ఎపిసోడ్స్ వరకే ‘జబర్దస్త్’ను తీయాలనుకున్న వాళ్లు ఆ తర్వాత కూడా కొనసాగించారని చెప్పారు.

‘జబర్దస్త్’లో టాలెంట్ అంతా ఒక్కరోజులో వచ్చింది కాదని, సంవత్సరాల పాటు చేసిన కృషి అని, ఈ కృషిలో చాలా మంది భాగస్తులు వున్నారని చెప్పారు. ‘జబర్దస్త్’ కాన్సెప్ట్ చెప్పిన వ్యక్తి సంజీవి అనీ, ఆయన దగ్గర వున్న నితిన్, భరత్ అనే కుర్రాళ్లు క్రియేటివిటీ వున్నవారని ప్రశంసించారు. అనసూయ, రష్మీ మంచి యాంకర్లు అని, కేవలం, ఈ షో ప్రారంభించిన ఏడాదికల్లా టాప్ రేంజ్ కు వెళ్లిపోయారని అన్నారు.

More Telugu News