Manda Krishna: ఆర్టీసీ ఆస్తులను బడాబాబులకు అమ్ముకోవడానికే సంస్థను నిర్వీర్యం చేస్తున్నారు: మంద కృష్ణ

  • 52వ రోజుకు చేరిన తెలంగాణ ఆర్టీసీ సమ్మె
  • కోదాడలో సేవ్ ఆర్టీసీ నిరసన కార్యక్రమం
  • హాజరైన మంద కృష్ణ

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ఆర్టీసీ ఆస్తులను బడాబాబులకు అమ్ముకోవడానికే సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టిన ఆర్టీసీ సోదర సోదరీమణులపై లాఠీ చార్జి చేయించిన ఘనుడు కేసీఆర్ అని మండిపడ్డారు. ఆర్టీసీ సమ్మె 52వ రోజుకు చేరిందని, అయినప్పటికీ సీఎం కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం ఆయన నిరంకుశ ధోరణికి నిదర్శనం అని విమర్శించారు.

కోదాడలో ఇవాళ నిర్వహించిన సేవ్ ఆర్టీసీ నిరసన కార్యక్రమానికి మంద కృష్ణ కూడా హాజరయ్యారు. ఎంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఉపాధి కల్పన చేయకపోగా, 50 వేల మంది ఉద్యోగులను తొలగించడం ద్వారా వాళ్ల కుటుంబాలను వీధిన పడేశారని ఆరోపించారు. ఈ పరిణామాలకు కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

More Telugu News