Jabardasth: నాపై లేనిపోనివన్నీ రాయొద్దు: ‘జబర్దస్త్’ యాంకర్ అనసూయ

  • దేవుడి దయ వల్ల నేను ఇంకా ‘జబర్దస్త్’ అనసూయనే
  • నా నుంచి వచ్చే సున్నిత సమాధానాలు కోల్పోవద్దు
  • ఈ వ్యాఖ్యలు ఎవరి గురించి చేశానో వాళ్లకు తెలుసు

పాప్యులర్ కామెడీ షో ‘జబర్దస్త్’ యాంకర్ అనసూయ ఆ షోకు గుడ్ బై చెప్పిందని, చెప్పేస్తోందంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వదంతులు వ్యాపించాయి. ఈ ప్రచారాలపై అనసూయ స్పందించకపోవడంతో అవి ‘నిజమే’నని అనుకుంటున్న సమయంలో ఆమె స్పందించింది. ఆ దేవుడి దయ వల్ల ఇంకా తాను ‘జబర్దస్త్’ అనసూయగానే వున్నానని స్పష్టం చేస్తూ ఓ ట్వీట్ చేసింది. ‘జబర్దస్త్’ షోను వీడుతున్నానంటూ వస్తున్న వదంతులపై క్లారిటీ ఇస్తానని, లేనిపోనివన్నీ రాసి తన నుంచి వచ్చే సున్నితమైన సమాధానాలను కోల్పోవద్దంటూ సున్నితంగా హెచ్చరించిన అనసూయ, ఈ వ్యాఖ్యలు తాను ఎవరి గురించి చేశానో వాళ్లకు బాగా తెలుసని పేర్కొంది.

More Telugu News