YSRCP: దివ్యాంగుడికి వైసీపీ ఎమ్మెల్యే రజని చేయూత

  • కాళ్లులేని వ్యక్తికి మూడు చక్రాల సైకిల్ అందజేత
  • చిలకలూరిపేట వైసీపీ కార్యాలయంలో కార్యక్రమం
  • సీఎం జగన్ స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్న రజని

ఓ నిరుపేద దివ్యాంగుడికి చిలకలూరి పేట ఎమ్మెల్యే, వైసీపీ నేత విడదల రజని చేయూతగా నిలిచారు. చిలకలూరిపేట రూరల్ మండలం కట్టుబడివారిపాలెంకు చెందిన తోకల శ్రీనివాసరావు అనే దివ్యాంగుడు కాళ్లు చచ్చుబడిపోయి నడవలేని స్థితిలో ఉన్నాడు. అతను  సాయం కోసం ఎదురుచూస్తుండగా, ఈ విషయం ఎమ్మెల్యే రజనికి తెలిసింది. ఆమె తన వీఆర్ ఫౌండేషన్ (విడదల రజని ఫౌండేషన్) ద్వారా ఆ దివ్యాంగుడికి మూడు చక్రాల సైకిల్ అందజేశారు. చిలకలూరిపేట వైసీపీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో మూడు చక్రాల సైకిల్ ను తోకల శ్రీనివాసరావుకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం జగన్ స్ఫూర్తితోనే వీఆర్ ఫౌండేషన్ ద్వారా పేదలకు సాయపడుతున్నామని తెలిపారు.

More Telugu News