Madhya Pradesh: ట్విట్టర్ బయోడేటా నుంచి 'కాంగ్రెస్ నేత' అనే పదాన్ని తొలగించిన జ్యోతిరాధిత్య సింధియా

  • కాంగ్రెస్ మధ్యప్రదేశ్ కీలక నేత జ్యోతిరాధిత్య సింధియా
  • బయోడేటా చిన్నగా ఉండాలనే తొలగించానని వివరణ
  • కాంగ్రెస్ పై అసంతృప్తి?

కాంగ్రెస్ మధ్యప్రదేశ్ కీలక నేత  జ్యోతిరాధిత్య సింధియా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలోని తన బయోడేటా నుంచి 'కాంగ్రెస్ నేత' అనే పదాన్ని తొలగించారు. బయోడేటా చిన్నగా ఉండాలనే తొలగించానని ఆయన వివరణ ఇస్తున్నారు. తన బయోడేటా స్థానంలో 'ప్రజా సేవకుడు.. క్రికెట్ ప్రేమికుడు' అని ఆయన పెట్టుకున్నారు. అయితే, దీనిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
     మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో విభేదాల కారణంగా ఆయన అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన రహస్యంగా ప్రధాని మోదీతోనూ భేటీ అయ్యారని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మధ్య ప్రదేశ్‌లోని గుణ నియోజకవర్గం నుంచి సింధియా పోటీ చేసి ఓడిపోయారు.

గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన జ్యోతిరాధిత్య సింధియా.. లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో తమ పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. కొన్ని నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ తప్పుకున్న సమయంలో ఈ పదవి రేసులో జ్యోతిరాదిత్య సింధియా కూడా ఉన్నారంటూ కూడా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

More Telugu News