Vidadala Rajini: మహిళా ఎమ్మెల్యేకు షాక్... బుగ్గగిల్లి ముద్దిచ్చిన బుడతడు... వీడియో ఇదిగో!

  • ఓ అధికారిక కార్యక్రమంలో ఆసక్తికర ఘటన
  • రజిని బుగ్గ గిల్లి, ముద్దు పెట్టుకున్న విద్యార్థి
  • నవ్వుతూ వెళ్లిపోయిన రజిని

చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనికి ఓ బుడతడు షాకిచ్చాడు. వివరాల్లోకి  వెళ్తే, ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న రజని అందరినీ పలకరిస్తూ వస్తుండగా... ఓ స్కూల్ విద్యార్థి ఆమె బుగ్గ గిల్లి, ముద్దు పెట్టుకున్నాడు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో షాక్ తిన్న ఆమె... ఆ తర్వాత నవ్వుతూ అక్కడి నుంచి కదిలారు. ఈ పరిణామంతో అక్కడున్న వారంతా హాయిగా నవ్వుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

More Telugu News