Ajit Pawar: మరో ట్విస్ట్.. అజిత్ పవార్ కు రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిని ఆఫర్ చేసిన శివసేన?

  • ప్రభుత్వ ఏర్పాటుపై ఆశలు వదులుకోని శివసేన
  • అజిత్ పవార్ ను ఆకర్షించేందుకు యత్నాలు
  • ఇప్పటికే బీజేపీకి మద్దతు పలికిన అజిత్ పవార్

మహారాష్ట్ర రాజకీయాలు సస్పెన్స్ సినిమాను తలపిస్తున్నాయి. ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్ బీజేపీకి మద్దతివ్వడంతో... ఫడ్నవీస్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఈ పరిణామంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు షాక్ కు గురయ్యాయి. మరోవైపు, ఎలాగైనా అధికారాన్ని చేపట్టేందుకు శివసేన కూడా శతవిధాలా ప్రయత్నిస్తోంది.

ఈ క్రమంలో అజిత్ పవార్ ను ఆకర్షించేందుకు శివసేన యత్నిస్తోంది. తమకు మద్దతు పలికితే రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని అజిత్ పవార్ కు శివసేన ఆఫర్ చేసినట్టు ముంబై పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఇప్పటికే బీజేపీతో చేయి కలిపి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన అజిత్ పవార్ ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ నెలకొంది.

More Telugu News