Supreme Court: మూడు పార్టీల ప్రభుత్వం ఏర్పడకుండా ఇలా వ్యవహరించారు.. వెంటనే బలపరీక్ష నిర్వహించాలి: సుప్రీంకోర్టులో కపిల్ సిబాల్

  • శనివారం ఉదయం 5 గంటల్లోపు అంతా అయిపోయింది
  • రాష్ట్రపతి పాలన ఎత్తేయడం వెనుక దురుద్దేశం ఉంది 
  • బలపరీక్షకు సీనియర్ సభ్యుడు ప్రొటెం స్పీకర్ గా ఉంటారు

మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన తరఫున న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపిస్తున్నారు. శుక్రవారం రాత్రి 7 నుంచి శనివారం ఉదయం 5 గంటల్లోపు అంతా అయిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. మూడు పార్టీల ప్రభుత్వం ఏర్పడకుండా ఇలా వ్యవహరించారని ఆయన సుప్రీంకోర్టుకు తెలిపారు. రాష్ట్రపతి పాలన ఎత్తేయడం వెనుక దురుద్దేశం ఉందని చెప్పారు. వెంటనే బలపరీక్ష నిర్వహించాలని కోరారు. సీనియర్ సభ్యుడు ప్రొటెం స్పీకర్ గా ఉంటారని చెప్పారు.

అజిత్ పవార్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... బీజేపీకి మద్దతు ఇవ్వాలనే అధికారాన్ని ఎన్సీపీ నేతలు అజిత్ పవార్ కు కల్పించారని చెప్పారు. ఎన్సీపీ శాసనసభ పక్ష నేతగా అజిత్ పవార్ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. అజిత్ పవార్ ఇచ్చిన లేఖ ఆధారంగా గవర్నర్ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించారని వివరించారు.

More Telugu News