Nara Lokesh: ఇసుక వారోత్సవాలంటే ప్రజలకి ఇసుక అందుబాటులోకి తీసుకొస్తారనుకుని పొరపాటు పడ్డాను: నారా లోకేశ్

  • జగన్ గారు అన్నది ఇసుక 'వార్' ఉత్సవాలు 
  • ఈ విషయం నాకు తరువాత అర్థమైంది 
  • ఇసుక వాటాల కోసం వైకాపా నాయకులు కర్రలతో దాడులు చేసుకున్నారు

ఇసుక వారోత్సవాలని ఏపీ సీఎం జగన్ చెబితే ప్రజలకి ఇసుక అందుబాటులోకి తీసుకొస్తారనుకుని పొరపాటు పడ్డానని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. 'జగన్ గారు అన్నది ఇసుక 'వార్' ఉత్సవాలు అని తరువాత అర్థం అయ్యింది. ఇసుక వార్ లో భాగంగా ఇసుక వాటాల కోసం వైకాపా నాయకులు కర్రలతో దాడులు చేసుకొని, తలలు పగలు కొట్టుకుంటున్నారు' అని ఎద్దేవా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.
 
ఒక పక్క వైకాపా నాయకులు ఇసుకలో వాటాల కోసం వీధి రౌడీల్లా కొట్టుకుంటుంటే గుంటూరు జిల్లా, పెదకాకానిలో జగన్ గారి చేతగాని పాలనకి మరో భవన నిర్మాణ కార్మికుడు పీట్ల శ్రీను ఆత్మహత్యకు పాల్పడ్డాడని నారా లోకేశ్ విమర్శించారు. 'వైకాపా ఇసుక వార్ ఉత్సవాలు, ఇసుక పంచాయితీలు ఆపి కార్మికులకు బతుకు భరోసా ఇవ్వండి జగన్ గారూ' అని లోకేశ్ ట్వీట్ చేశారు.

More Telugu News